ఉన్నతవిద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పుల కోసం కేంద్రం అనేక సంస్కరణలు చేపడుతోందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు.
సాక్షి, బెంగళూరు: ఉన్నతవిద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పుల కోసం కేంద్రం అనేక సంస్కరణలు చేపడుతోందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఎడ్యుకేషన్ ప్రమోషన్ సొసైటీ ఆఫ్ ఇండియా(ఈపీఎస్‌ఐ) ఆధ్వర్యంలో ఉన్నత విద్యలో భారత్ పురోగతిపై మంగళవారం జరిగిన సదస్సులో స్మృతి ఇరానీ పాల్గొన్నారు.
విద్యావిధానం ఎలా ఉండాలన్నదానిపై దేశంలోని ఐదు వేలకుపైగా విద్యారంగ సంస్థల అభిప్రాయాలను సేకరిస్తున్నామని ఆమె చెప్పారు. ఉన్నత విద్యకు సంబంధించి వృత్తివిద్యా కోర్సుల పై కళాశాలలు తమ దృక్పథాన్ని మార్చుకోవాలని సూచించారు. ప్రముఖ విద్యా సంస్థల వ్యవస్థాపకులు, వైస్ చాన్స్‌లర్లు పాల్గొన్న ఈ కార్యక్రమానికి వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఐటీ) ముఖ్య స్పాన్సర్‌గా వ్యవహరించింది.