ఆయన యూటర్న్‌ సీఎం.. | Chandrakant Patil Says Will Now Be known As Uddhavji Thackeray Turn | Sakshi
Sakshi News home page

ఆయన యూటర్న్‌ సీఎం..

Dec 26 2019 8:46 AM | Updated on Dec 26 2019 12:10 PM

Chandrakant Patil Says Will Now Be known As Uddhavji Thackeray Turn - Sakshi

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే యూటర్న్‌ సీఎంగా పేరొందారని బీజేపీ రాష్ట్ర చీఫ్‌ చంద్రకాంత్‌ పాటిల్‌ ఆరోపించారు.

పూణే : వ్యవసాయ రుణాల మాఫీపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే యూటర్న్‌ తీసుకున్నారని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ చంద్రకాంత్‌ పాటిల్‌ దుయ్యబట్టారు. సంపూర్ణ రుణ మాఫీని వాగ్ధానం చేసిన ఠాక్రే ఇప్పుడు కేవలం రూ 2 లక్షల వరకే మాఫీని ప్రకటించారని విమర్శించారు. ఏ విషయానికైనా కొన్ని పరిమితులు ఉంటాయని తెలుసని, ప్రకటన చేయడం అమలుపరచడానికి వ్యత్యాసం ఏంటో ఇప్పుడు ఠాక్రేకు అవగతమైందని పాటిల్‌ ఎద్దేవా చేశారు. ఇక నుంచి యూటర్న్‌ అంటే ఉద్ధవ్‌ ఠాక్రే అని ఆయన అభివర్ణించారు.

Advertisement
 
Advertisement
Advertisement