2022కల్లా కొత్త పార్లమెంట్‌!

Centre to invite bids for Parliament building revamp - Sakshi

లేకపోతే పాత భవనానికే కొత్త సొబగులు

న్యూఢిల్లీ: 2022 పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు కొత్తగా నిర్మించిన లేదా ఉన్న భవనాలకే ఆధునిక హంగులద్దిన పార్లమెంట్‌లో జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు గురువారం తెలిపాయి. రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్‌కు మధ్య ఉత్తర, దక్షిణ బ్లాకుల వద్ద 3 కిలోమీటర్ల విశాలమైన సెంట్రల్‌ విస్తాను ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించనున్నారు. దీని కోసం ప్రభుత్వం దేశ విదేశాల నుంచి డిజైన్, ఆర్కిటెక్ట్‌ సంస్థలను పిలిచింది. కొత్తగా నిర్మించనున్న ఈ భవనాలు కనీసం 150 నుంచి 200 ఏళ్లపాటు సేవలు అందించనున్నాయి. ఫ్లోటింగ్‌ ఆఫ్‌ రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ)లోని నిర్దేశిత నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.  

ఇంకా నిర్ణయం తీసుకోలేదా !
ఇప్పుడున్న భవన సముదాయం 1927లో నిర్మితమైందని, ప్రస్తుతం కావాల్సిన అవసరాలను అది అందుకోలేకపోతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే కొత్త భవనం నిర్మించాలా లేక పాతదాన్నే పునర్నిర్మించాలా ? అనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. వివిధ మంత్రిత్వ శాఖల కింద ఉన్న ఆఫీసు కార్యాలయాలను నిర్వహించేందుకు ఏటా రూ. 1,000 కోట్లు ఖర్చువుతోంది. కొత్తవాటిని నిర్మించడం ద్వారా ఈ వ్యయాన్ని ఆదా చేయ వచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top