రైలులో మహిళను వేధించిన ఎమ్మెల్యే | Case filed against JD-U MLA for misbehaving with woman on Rajdhani Express | Sakshi
Sakshi News home page

రైలులో మహిళను వేధించిన ఎమ్మెల్యే

Jan 19 2016 11:48 AM | Updated on Sep 3 2017 3:55 PM

రైలులో మహిళను వేధించిన ఎమ్మెల్యే

రైలులో మహిళను వేధించిన ఎమ్మెల్యే

బిహార్ అధికార జేడీయూ ఎమ్మెల్యే బీమా భారతి తన భర్త పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడానికి సాయపడినట్టు ఆరోపణలు ఎదుర్కోగా.. అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఆలం ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

పట్నా: బిహార్ అధికార జేడీయూ ఎమ్మెల్యే బీమా భారతి తన భర్త పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడానికి సాయపడినట్టు ఆరోపణలు ఎదుర్కోగా.. అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఆలం ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు సర్ఫరాజ్పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆదివారం కటిహార్లో గువహటి రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో సర్ఫరాజ్ ఎక్కారు. అదే రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రయాణికురాలి పట్ల సర్ఫరాజ్ అసభ్యంగా ప్రవర్తించి వేధించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నారని బాధితురాలి భర్త చెప్పారు. రైలు పట్నాకు వెళ్లిన తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిషన్గంజ్ జిల్లా జోకిహట్ నుంచి సర్ఫరాజ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement