ఫ్రెండే కదా అని ఇంటి పిలిస్తే.. దోస్తు భార్యపై కన్నేసి అసభ్య ప్రవర్తన..

Husband Who Killed His Friend For Misbehaving With Wife - Sakshi

యశవంతపుర: తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన స్నేహితుడిని భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ షాకింగ్‌ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా కరోశి గ్రామానికి చెందిన సునీల్‌ (25), జైనాపురకు చెందిన మహంతేశ్‌లు మంచి స్నేహితులు. ఇటీవల మహంతేశ్‌ భార్యతో సునీల్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో, ఆగ్రహానికి గురైన మహంతేశ్‌ ఈ నెల 2న మాట్లాడాలి అని చెప్పి అతడిని ఇంటికి పిలుపించుకున్నాడు. అనంతరం, కరోశి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పీకల దాక సునీల్‌కు మద్యం తాగించాడు. 

అప్పటికే ఆగ్రహంతో రగలిపోతున్న మహంతేశ్‌.. మద్యం మత్తులో ఉన్న సునీల్‌ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం, ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా, అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో, మహంతేశ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు.    

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top