విమానాశ్రయంలో బంగారం పట్టివేత | capture gold at koyambathur | Sakshi
Sakshi News home page

విమానాశ్రయంలో బంగారం పట్టివేత

Mar 13 2017 3:16 PM | Updated on Aug 2 2018 4:35 PM

కోయంబత్తూరు విమానాశ్రయంలో సోమవారం రూ.25 లక్షల విలువైన బంగారం పట్టుబడింది.

కోయంబత్తూరు(కేరళ): కోయంబత్తూరు విమానాశ్రయంలో సోమవారం రూ.25 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. రెవెన్యూ ఇంటలిజెన్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని పలక‍్కడ్‌ ప్రాంతానికి చెందిన ప్రభాకరన్‌ సోమవారం ఉదయం షార్జా నుంచి కోయంబత్తూర్‌ విమానాశ్రయంలో దిగాడు. అతని తీరును అనుమానించిన అధికారులు లగేజిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో అతని స్పీకర్‌ బాక్స్‌లో దాదాపు 700 గ్రాముల బరువున్న బంగారు కడ్డీలు లభించాయి. ఈ మేరకు విచారణ నిమిత్తం ప్రభాకరన్‌ను పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement