జమ్మూలో పాక్‌ బలగాల దుశ్చర్య

BSF jawan killed in Pakistan firing - Sakshi

సరిహద్దు వెంబడి బుల్లెట్ల వర్షం

ఒక జవాను, నలుగురు పౌరులు మృతి

జమ్మూ: కశ్మీర్‌ సరిహద్దులో పాకిస్తాన్‌ బలగాలు రెచ్చిపోయాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఆర్‌ఎస్‌ పుర, బిష్నా, ఆర్నియా సెక్టార్లలోని గ్రామాలు, బోర్డర్‌ ఔట్‌పోస్టులపై మోర్టార్లు, బుల్లెట్ల వర్షం కురిపించాయి. ఈ కాల్పుల్లో జార్ఖండ్‌కు చెందిన బీఎస్‌ఎఫ్‌ జవాను సీతారాం ఉపాధ్యాయ, నలుగురు పౌరులు ప్రాణాలుకోల్పోయారు.  12 మంది గాయపడ్డారు.    పాక్‌ బలగాల చర్యలను మన బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయని బీఎస్‌ఎఫ్‌ ఐజీ జమ్మూ ఫ్రాంటియర్‌ రామ్‌ అవతార్‌ చెప్పారు. 2011లో సీతారాం బీఎస్‌ఎఫ్‌లో చేరారు. అతనికి మూడేళ్ల కుమారుడు, ఏడాది కుమార్తె ఉన్నారని అధికారులు తెలిపారు.

నేడు కశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటన
ప్రధాని మోదీ రెండు రోజులపాటు కశ్మీర్‌లో పర్యటిస్తారు. లఢఖ్, కశ్మీర్‌ లోయ మధ్య అన్ని కాలాల్లోనూ రాకపోకలు సాగించేందుకు వీలుగా నిర్మించనున్న ప్రతిష్టాత్మక జోజిల్లా సొరంగం పనులను ఆయన శనివారం ప్రారంభించనున్నారు. శ్రీనగర్‌ రింగ్‌రోడ్, జమ్మూ రింగ్‌రోడ్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. కిషన్‌గంగా పవర్‌ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top