హైఅలర్ట్ ప్రకటించిన బీఎస్ఎఫ్ | BSF alerts positions along Pak border in Punjab | Sakshi
Sakshi News home page

హైఅలర్ట్ ప్రకటించిన బీఎస్ఎఫ్

Nov 2 2014 11:08 PM | Updated on Sep 2 2017 3:46 PM

హైఅలర్ట్ ప్రకటించిన బీఎస్ఎఫ్

హైఅలర్ట్ ప్రకటించిన బీఎస్ఎఫ్

పాక్‌లో వాఘా సరిహద్దు వద్ద ఆత్మాహుతి దాడి నేపథ్యంలో అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్.. పంజాబ్‌లోని ఇండో-పాక్ సరిహద్దు వెంబడి హైఅలర్ట్ ప్రకటించింది.

న్యూఢిల్లీ: పాక్‌లో వాఘా సరిహద్దు వద్ద ఆత్మాహుతి దాడి నేపథ్యంలో అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్.. పంజాబ్‌లోని ఇండో-పాక్ సరిహద్దు వెంబడి హైఅలర్ట్ ప్రకటించింది. తాజా పరిస్థితుల దృ ష్ట్యా సోమవారం నుంచి మూడు రోజుల పాటు సరిహద్దుల వద్ద సైనిక విన్యాసాలను రద్దు చేసినట్టు బీఎస్‌ఎఫ్ చీఫ్ డీకే పాఠక్ చెప్పారు.

 

ఫిరోజ్‌పూర్ ప్రాంతంలో దాడులకు పాల్పడే అవకాశం ఉందని కొద్దిరోజుల క్రితమే నిఘా వర్గాలు హెచ్చరించాయని, ఈ నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసినట్టు చెప్పారు. పాకిస్థాన్ లో ఆదివారం జరిగిన మానవ బాంబు దాడిలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలోమరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. లాహోర్ లోని వాఘా సరిహద్దు వద్ద ఆత్మాహుతి దాడి జరగడంతో  భారీ ప్రాణనష్టం వాటిల్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement