రంజాన్‌ ప్రార్థనల్లో బుడ్డోడు.. నెటిజన్లు ఫిదా

Boy Offering Prayers During Ramadan With His Toy Adorable Video - Sakshi

ప్రపంచంలో కల్మషం లేని మనుషులు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్లు పిల్లలు మాత్రమే. చిన్నారులు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. మురిపాల మూటలు కడుతూ నిర్మలమైన హృదయం కలిగి ఉండే పిల్లలను ప్రేమించనివాళ్లు ఒక్కరు కూడా ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం అలాంటి ఓ పిల్లాడి చేష్టలు నెటిజన్లకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ప్రస్తుతం కరోనా కట్టడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో నిత్యావసరాల కోసం మినహా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా సామూహిక ప్రార్థనలు, బహిరంగ సమావేశాలు నిర్వహించేందుకు అనుమతి లేదు. ప్రతి ఒక్కరు విధిగా సామాజిక ఎడబాటు పాటించాల్సిందే.(సమ్మేళన ప్రార్థనలకు దూరంగా ఉండండి)

ఇక ప్రస్తుతం పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ముస్లింలందరూ ఇంట్లోనే ప్రార్థన చేసుకోవాలని మత పెద్దలు, ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో తమ ఇంట్లోని పెద్దలు నమాజ్‌ చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన పిల్లాడు తాను సైతం ప్రార్థన చేసేందుకు ఉపక్రమించాడు. రెడ్‌ టీ షర్టు, నిక్కరు వేసుకున్న ఆ చిన్నారి... తనతో పాటు ఓ డైనోసర్‌ బొమ్మను తీసుకొచ్చి..  ప్రార్థన చేయాలన్నట్లుగా దాని మెడలు వంచుతూ కెమెరాకు చిక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అందరినీ ఆకర్షిస్తోంది. బుడ్డోడు భలే ఉన్నాడు అంటూ అతడి చేష్టలకు నెటిజన్లు ఫిదా అవుతూ రంజాన్‌ శుభాకాంక్షలు చెబుతున్నారు.(నాన్న..ఇంకెంత దూరం!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top