వయసు 14... సంపాదన 2.5 లక్షలు | boy earning lakhs | Sakshi
Sakshi News home page

వయసు 14... సంపాదన 2.5 లక్షలు

Apr 11 2017 2:37 AM | Updated on Sep 5 2017 8:26 AM

వయసు 14... సంపాదన 2.5 లక్షలు

వయసు 14... సంపాదన 2.5 లక్షలు

తమిళనాడుకు చెందిన ఓ బాలుడు యాప్స్‌ను రూపొందిస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడుకు చెందిన ఓ బాలుడు యాప్స్‌ను రూపొందిస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. కడలూరు జిల్లా మంగిలంపేట్టైకి చెందిన అనిల్‌కుమార్, పెట్టా దంపతుల కుమారుడు రిషికుమార్‌(14) ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. 

ఆండ్రాయిడ్, ఆపిల్‌ ఫోన్ల కోసం ‘మోషన్‌ ట్రేడర్‌’ అనే యాప్‌ను సృష్టించాడు. దీని ద్వారా మొబైల్‌ ఫోన్‌ ఆన్‌ చేయకుండానే సెన్సర్‌ ద్వారా ముఖాలను నిక్షిప్తం చేయవచ్చు. అలాగే 72కి పైగా గేమ్స్‌ యాప్‌లను, 30కి పైగా ఇతర యాప్‌లను తయారుచేసి అనేక కంపెనీలకు అమ్మివేశాడు. ‘రోబోనాటిక్స్‌’ అనే కంపెనీని స్థాపించి నిర్వహిస్తున్న రిషికుమార్‌ మాట్లాడుతూ.. ఇంటర్నెట్‌ ద్వారా యాప్‌లను తయారు చేయడం, రోబోలతో పనిచేయించడం, ప్రోగ్రాంల తయారీ నేర్చుకున్నట్లు చెప్పాడు. యాప్‌ల ద్వారా నెలకు రూ. 2.50 లక్షలు సంపాదిస్తున్నానని చెప్పాడు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement