మందుగుండు యూనిట్‌లో పేలుడు.. 20 మంది మృతి? | blast in tamilnadu leads to several deaths | Sakshi
Sakshi News home page

మందుగుండు యూనిట్‌లో పేలుడు.. 20 మంది మృతి?

Dec 1 2016 9:23 AM | Updated on Sep 5 2018 9:47 PM

మందుగుండు యూనిట్‌లో పేలుడు.. 20 మంది మృతి? - Sakshi

మందుగుండు యూనిట్‌లో పేలుడు.. 20 మంది మృతి?

తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తురయూర్ సమీపంలోని మురుగంపట్టిలోని ఓ మందుగుండు తయారీ యూనిట్‌లో పేలుడు సంభవించింది. మందుగుండు గోడౌన్‌లో ఎంతమంది ఉన్నారన్న విషయం తెలియట్లేదు. వాళ్లలో 20 మంది మృతిచెందారని సమాచారం. మంటల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 
 
తిరుచ్చి జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడినుంచి బాణసంచా తయారీకోసం వివిధ ప్రాంతాలకు పంపేందుకు మందుగుండు తయారుచేస్తారు. ఉదయం 6 గంటల సమయంలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాంతో 20 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. ఏడు వాహనాల్లో అక్కడకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది లోపల ఉన్నవారని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. మురుగంపట్టిలో ఊరు చివర ఉన్న ప్రదేశం కావడంతో లోపల ఎంతమంది ఉన్నారు, ఎందరు చనిపోయారని తెలియడం లేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement