వాజ్‌పేయి కోలుకోవాలని బీజేపీ కార్యకర్తల పూజలు | BJP Workers Conducted Havan For Former PM Vajpayee  | Sakshi
Sakshi News home page

వాజ్‌పేయి కోలుకోవాలని బీజేపీ కార్యకర్తల పూజలు

Jun 12 2018 11:09 AM | Updated on Aug 16 2018 4:04 PM

BJP Workers Conducted Havan For Former PM Vajpayee  - Sakshi

సాక్షి, లక్నో : ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. వాజ్‌పేయి ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ కాన్పూర్‌లో బీజేపీ కార్యకర్తలు పూజలు నిర్వహించారు. పూర్తి ఆరోగ్యంతో వాజ్‌పేయి ఇంటికి చేరుకోవాలని ఈ సందర్భంగా వారు ప్రార్థనలు చేశారు.

తొలుత రొటీన్‌ చెకప్‌లో భాగంగా వాజ్‌పేయిని ఎయిమ్స్‌కు తరలించినట్టు వైద్యులు పేర్కొన్నారు. కాగా ఆయన మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు. వాజ్‌పేయికి నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందచేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సహా పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌లో వాజ్‌పేయిని పరామర్శించి, చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement