గుజరాత్లోని రాజ్కోట్లో భారతీయ జనతాపార్టీ మైనారిటీ నేత ఐయాస్ ఖాన్ పఠాన్ అతని కొడుకు అసిఫ్ లను కాల్చి చంపారు.
	రాజ్కోట్: గుజరాత్లోని రాజ్కోట్లో  తండ్రీకొడుకుల హత్య కలకలం   రేపింది.  రాష్ట్రంలోని  భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మైనారిటీ నేత ఐయాస్  ఖాన్ పఠాన్ అతని కుమారుడు అసిఫ్ లను  కాల్చి చంపారు. 
	
	తమ నివాసంలో నిద్రిస్తున్న తండ్రీ కొడుకులను  గుర్తు  తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. శనివారం  అర్థరాత్రి ఈ హత్యలు జరిగినట్టుతెలుస్తోంది.  హుటాహుటిన సంఘటనా స్థలానికి  చేరుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
	
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
