జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, పీడీపీ నువ్వా నేనా అన్నట్టు పోటీపడుతున్నాయి.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, పీడీపీ నువ్వా నేనా అన్నట్టు పోటీపడుతున్నాయి. మొదట్లో పీడీపీ ముందంజలో ఉండగా, ప్రస్తుతం బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. క్రమేణా పీడీపీ జోరు కాస్త తగ్గగా, బీజేపీ మరింత ముందంజ వేసింది.
ప్రస్తుతం బీజేపీ 23 చోట్ల ముందంజలో ఉండగా, పీడీపీ 20 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాగా అధికార నేషనల్ కాన్ఫరెన్స్ చతికిలపడింది. మొదట్లో ఎన్సీ, కాంగ్రెస్ వెనుకబడినా క్రమేణా పుంజుకుంటున్నాయి.