⇒ బీజేపీ శాసనసభాపక్ష నేతగాఎన్నిక
⇒ ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి కాషాయదళంలో చేరిన బీరేన్
⇒ హైడ్రామా నడుమ ఇబోబీ రాజీనామా
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో తొలి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా రాష్ట్ర మాజీ మంత్రి నాంగ్‌తోంబం బీరేన్ సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు ఆయనను తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ విషయాన్ని పార్టీ నేతలైన కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్‌లు మీడియాకు తెలిపారు. తర్వాత బీరేన్ రాజ్‌భవన్‌కు వెళ్లి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ నజ్మాహెప్తుల్లాను కోరారు. కాంగ్రెస్ కేబినెట్‌లో పదేళ్లు పనిచేసిన 56 ఏళ్ల బీరేన్ గత ఏడాది అక్టోబర్‌లో ఆ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
మణిపూర్‌కు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి, బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నానని ఆయన అన్నారు. ‘కాంగ్రెస్ దుష్పరిపాలనకు నిరసనగా ఆ పార్టీ నుంచి బయటకొచ్చాను. మోదీ నాయకత్వంలో సుపరిపాలన అందిస్తామని హామీ ఇస్తున్నా’ అని విలేకర్లతో చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 28, బీజేపీకి 21 సీట్లు దక్కడం తెలిసిందే. తమకు 32 మంది ఎమ్మెల్యేల మద్దతుందని బీజేపీ నేతలు ఆదివారం గవర్నర్‌కు చెప్పారు. చెరో నలుగురేసి ఎమ్మెల్యేలున్న నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ), నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్‌పీఎఫ్)తోపాటు ఒక లోక్‌జనశక్తి ఎమ్మెల్యే, ఒక తృణమూల్ ఎమ్మెల్యే, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీకి మద్దతిస్తున్నారు.
తొలి అవకాశం నాకివ్వాలి: ఇబోబీ
ప్రభుత్వ ఏర్పాటుకు ప్రస్తుత సీఎం, కాంగ్రెస్ నేత ఇబోబీ సింగ్ కూడా తీవ్రంగా యత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన హైడ్రామా నడుమ సోమవారం రాత్రి సీఎం పదవికి రాజీనామా చేసి, రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేశారు. అంతకుముందు.. ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించింది కనుక ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అవకాశం తనకే ఇవ్వాలని, తనకు మెజారిటీ ఉందని, బలపరీక్షకు సిద్ధమని అన్నారు. అయితే, ఆయన రాజీనామా చేయాలని, ఆ తర్వాతే ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తానని గవర్నర్ స్పష్టం చేయడంతో ఇబోబీ దిగొచ్చి మంగళవారం రాజీనామా చేస్తానన్నారు.
మారిన పరిణామాలతో సోమవారమే రాజీనామా చేశారు. ఇబోబీ, ఇతర కాంగ్రెస్ నేతలు ఆదివారం రాత్రి గవర్నర్‌ను కలిశారని రాజ్‌భవన్ వర్గాలు చెప్పాయి. ‘ఇబోబీ 28 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాబితా అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. తమకు ఎన్‌పీపీ మద్దతిస్తోందంటూ ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల పేర్లున్న కాగితం ఇచ్చారు. అయితే దాన్ని మద్దతు లేఖగా పరిగణించలేనని, ఆ నలుగురితోపాటు ఎన్‌పీపీ అధ్యక్షుణ్ని తీసుకురావాలని గవర్నర్ చెప్పారు’ అని వెల్లడించాయి.
ఎడిటర్, ఫుట్‌బాల్ క్రీడాకారుడు
మణిపూర్ అధికార పగ్గాలు చేపట్టనున్న బీరేన్ మాజీ పత్రికా సంపాదకుడు, జాతీయస్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారుడు కూడా. నహరోల్గి థౌండాగ్(యువత పాత్ర) అనే స్థానిక దినపత్రికకు ఆయన సంపాదకుడిగా పనిచేశారు. 2002లో డెమోక్రటిక్ రివల్యూషనరీ పార్టీ తరఫున హీన్‌గాగ్ స్థానం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి ఇబోబీ మంత్రివర్గంలో పదేళ్లు(2003–2012) పనిచేశారు. బీరేన్ కొడుకు అజయ్ ఒక విద్యార్థిని కాల్చిచంపడంతో 2012లో ఏర్పడిన కాంగ్రెస్ కేబినెట్‌లో ఆయనకు చోటు దక్కలేదు. ఇబోబీని పలు అంశాల్లో తీవ్రంగా వ్యతిరేకించిన బీరేన్ గత ఏడాది అక్టోబర్‌లో బీజేపీలో చేరారు.
మణిపూర్ సీఎంగా బీరేన్
Published Tue, Mar 14 2017 3:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement