త్వరలో చర్మంలాంటి కండోమ్: గేట్స్ | Bill Gates says progress made on new ultra-thin condom | Sakshi
Sakshi News home page

త్వరలో చర్మంలాంటి కండోమ్: గేట్స్

Sep 19 2014 2:06 AM | Updated on Sep 2 2017 1:35 PM

మహిళలు ఉపయోగించగల అత్యంత ఆధునికమైన, సులభతరమైన గర్భ నిరోధక సాధనాలతో పాటు చర్మంలాంటి పదార్ధంతో ..

న్యూఢిల్లీ: మహిళలు ఉపయోగించగల అత్యంత ఆధునికమైన, సులభతరమైన గర్భ నిరోధక సాధనాలతో పాటు చర్మంలాంటి పదార్ధంతో తయారయ్యే అత్యంత పలుచనైన కండోమ్‌ల తయారీ సంవత్సరం లోపు సాధ్యమవుతుందని భావిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. ఆ ప్రాజెక్టులకు బెల్ అండ్ మెలిండా గేట్ ఫౌండేషన్‌ల తరఫున తాము నిధులను సమకూరుస్తున్నామని వెల్లడించారు. ఢిల్లీలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన, తన భార్య మెలిండాతో కలసి పాల్గొన్నారు. అత్యంతాధునిక కండోమ్‌ల తయారీ సాధ్యమవుతోంది కానీ వాటిని చవక ధరలో అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన సవాలని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement