బీహార్‌లో విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ | Bihar student gang | Sakshi
Sakshi News home page

బీహార్‌లో విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్

Nov 22 2014 5:16 AM | Updated on Nov 9 2018 5:02 PM

బీహార్‌లో ఓ పాఠశాల విద్యార్థినిపై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

పాట్నా: బీహార్‌లో ఓ పాఠశాల విద్యార్థినిపై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పాట్నాకు 38 కిలోమీటర్ల దూరంలోని బిహ్తా ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాదళిత్ సామాజిక వర్గానికి చెందిన బాలిక పరీక్షల సన్నద్ధత కోసం ఆమె బిహ్తాలోని బంధువుల ఇంటికి వచ్చింది. గురువారం తోటి విద్యార్థినిని కలిసేందుకు ఆమె గ్రామానికి సమీపంలోని వంతెన వద్దకు వెళ్లింది.

ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఆరుగురు యువకులు వీరిద్దరినీ సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి అరుపులు విన్న స్థానికులు అక్కడికి  వచ్చి ఆమెను రక్షించారు. మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement