మరోసారి నోరుపారేసుకున్న బీజేపీ నేత | Bengal BJP chief calls 'molested' Jadavpur students 'shameless' | Sakshi
Sakshi News home page

మరోసారి నోరుపారేసుకున్న బీజేపీ నేత

May 14 2016 7:04 PM | Updated on Jul 23 2018 8:49 PM

పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత దిలీప్ ఘోష్ మరోసారి రెచ్చిపోయారు. జాదవ్ పూర్ యూనివర్శిటీ వివాదంలో శనివారం మహిళా విద్యార్థినులపై నోరుపారేసుకున్నారు

కోలకతా:  పశ్చిమ  బెంగాల్ బీజేపీ నేత దిలీప్ ఘోష్ మరోసారి  రెచ్చిపోయారు. జాదవ్ పూర్ యూనివర్శిటీ వివాదంలో శనివారం మహిళా  విద్యార్థినులపై నోరుపారేసుకున్నారు. వివేక్ అగ్నిహోత్రి ఫిలిం.. బుద్ధా ఇన్ ఎ ట్రాఫిక్ జాం  ఫిలిం ప్రదర్శన సంబర్భంగా రగిలిన వివాదంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు.  యూనివర్శిటీ విద్యార్థులు సిగ్గులేకుండా, అసభ్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ రక్షణ  గురించి అంత బాధ  ఉన్నపుడు  వివాదం జరుగుతున్న ప్రదేశానికి ఆ మహిళా విద్యార్థినులు ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు.
 
శనివారం  మీడియాతో  మాట్లాడిన దిలీప్ ఘోఫ్ ఏబీవీపీ  నేతలు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారటూ   ఆరోపించిన  విశ్వవిద్యాలయ విద్యార్థినులపై నిప్పులు  చెరిగారు. సిగ్గులేకుండా లైంగికంగా వేధించారంటున్నారని వ్యాఖ్యానించారు.  వారే ఉద్దేశ్యపూర్వకంగా పురుషులపై పడి, ఇప్పుడు  కావాలనే నిందిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  అంతటితో ఆయన  ప్రకోపం చల్లార లేదు. వారికి మద్దతు  పలకాల్సిన అవసరం లేదనీ,  చెప్పులతో కొట్టాలంటూ  ఆగ్రహంతో ఊగిపోయారు. విద్యార్థులకు నిజంగా రాజకీయాలు తెలిసి ఉంటే ప్రజాస్వామికంగా పోరాడాలని, అలా కాకుండా రాజకీయాలను దిగజారుస్తున్నారని మండిపడ్డారు.   సానుభూతి సాధించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
యూనివర్శిటీలో   ఈనెల  ఆరవ తేదీన బుద్ధా ఫిలిం ప్రదర్శన సందర్భంగా వామ పక్ష  విద్యార్థి  సంఘానికి, ఏబీవీపీకి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో  ఏబీపీవీ, తమపై లైంగికంగా వేధించిందంటూ   కొంతమంది విద్యార్థినులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  
కాగా  పాకిస్తాన్ జిందాబాద్' అన్న వారిని కుత్తుకులు కత్తిరించామని వ్యాఖ్యానించి గత మార్చిలో వివాదాన్ని రగిలించిన సంగతి  తెలిసిందే. అటు దిలీఫ్ ఘోష్ వ్యాఖ్యల్ని  విశ్వవిద్యాలయ విద్యార్థులు, మహిళా సంఘ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement