'ఢిల్లీ పోలీస్ కమిషనర్ దాక్కొని పనిచేయడు' | Bassi serious on AAP mla's allegation | Sakshi
Sakshi News home page

'ఢిల్లీ పోలీస్ కమిషనర్ దాక్కొని పనిచేయడు'

Dec 5 2015 11:32 AM | Updated on Sep 3 2017 1:33 PM

'ఢిల్లీ పోలీస్ కమిషనర్ దాక్కొని పనిచేయడు'

'ఢిల్లీ పోలీస్ కమిషనర్ దాక్కొని పనిచేయడు'

తనపై ఆప్ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినీతికి పాల్పడేవాళ్లను సమాధుల్లోకి పంపుతానని హూంకరించారు.

ఢిల్లీ: తనపై ఆప్ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినీతికి పాల్పడేవాళ్లను సమాధుల్లోకి పంపుతానని హూంకరించారు. భూముల కొనుగోలు వ్యవహారంలో కమిషనర్ బస్సీ అవినీతికి పాల్పడ్డారని ఆప్ ఎమ్మెల్యేలు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై బస్సీ మండిపడ్డారు.

ఆప్ ప్రభుత్వం తనపై చేపడుతున్న దుష్ప్రచారానికి బెదిరిపోనని బస్సీ స్పష్టం చేశారు. 'ఢిల్లీ కమిషనర్ దాక్కొని పనిచేయడం లేదు. వీధుల్లో నిలబడి పనిచేస్తాడు. నా బాధ్యతల నిర్వహణలో నేను ఎప్పుడూ నిజాయితీగానే ఉన్నాను. ఎప్పుడూ ఎవరినీ మోసం చేయలేదు. మోసానికి పాల్పడేవారిని సమాధి చేస్తా' అని బస్సీ తన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. నిజాన్ని ప్రజలకు తెలిపి, తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని ప్రజల ముందు ఉంచుతానన్నారు. ఆధారం లేకుండా ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని బస్సీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement