21 రోజుల తర్వాత ఆత్మీయ కలయిక.. | Bangalore Nurse Came Home After 21 Days And Cuddled Her Daughter | Sakshi
Sakshi News home page

21 రోజుల తర్వాత ఆత్మీయ కలయిక..

Apr 19 2020 10:36 AM | Updated on Apr 19 2020 3:53 PM

Bangalore Nurse Came Home After 21 Days And Cuddled Her Daughter - Sakshi

సాక్షి, బెంగళూరు : కరోనా వైరస్‌ రోగులకు చికిత్సనందిస్తూ ఆస్పత్రికే పరిమితమైన తల్లి, ఆమె కోసం వేచిచూస్తున్న చిన్నారి పాప ఎట్టకేలకు ఒక్కటయ్యారు. బెళగావి జిల్లాల్లో క్వారంటైన్‌ కేంద్రంలో కరోనా రోగులకు నర్స్‌ సుగంధ చికిత్స అందిస్తూ అక్కడే ఉంటున్నారు. తల్లిని చూడాలని ఆమె కూతురు ఏడవడంతో తండ్రి బైక్‌ మీద కూర్చోబెట్టుకుని ఆస్పత్రికి తీసుకురావడం, తల్లీకూతురు ఇద్దరూ దూరం నుంచే పలకరించుకొనే ఫోటోలు, వీడియోలు ఇటీవల టీవీలు, సోషల్‌ మీడియాలో రావడం తెలిసిందే. అది చూసి సీఎం యడియూరప్ప సుగంధకు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు.

అయితే సుగంధ శనివారం ఇంటికి చేరుకున్నారు. సుమారు 21 రోజుల తర్వాత అమ్మ ఇంటికి రావడం చూసిన ఆ పాప తన తల్లిని పరుగెత్తుకుని వెళ్లి హత్తుకుంది. సుగంధ తన కుమార్తెను ముద్దాడుతూ ఆప్యాయంగా ఎత్తుకుని పులకించారు.

చదవండి : అమ్మ కావాలంటూ గుక్క పెట్టి ఏడ్చిన చిన్నారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement