బీజేపీలో బ్రహ్మచారులకే పదవులు | Bachelors have bright future in BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో బ్రహ్మచారులకే పదవులు

Oct 26 2017 11:06 AM | Updated on Oct 26 2017 11:20 AM

Bachelors have bright future in BJP

సాక్షి, లక్నో : భారతీయ జనతాపార్టీలో బ్రహ్మచారులకు అద్వితీయమైన భవిష్యత్‌ ఉందని చత్తీస్‌గఢ్‌ కార్మిక శాఖమంత్రి భయాలాల్‌ రాజ్‌వాడే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు దీపక్‌ పటేల్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

దీపక్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బీజేపీ నేతలు, మంత్రులు ఇతర పార్టీ ముఖ్యలతో మాట్లాడుతూ.. మన ప్రధాని నరేంద్ర మోదీ ఒక బ్రహ్మచారి, అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సాహ్‌ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వివాహాలు కాలేదు.. వారంతా బ్రహ్మచారులే అని పేర్కొన్నారు. అంతేకకా మన పార్టీలో బ్రహ్మచారులకే రాజకీయ భవిష్యత్‌ ఉందని వ్యాఖ్యానిం‍చారు. ఈ దశలో కొందరు నేతలు.. రాజ్వాడే వ్యాఖ్యలను సమర్థించగా.. మరికొందరు మాత్రం అలా మాట్లాడడం తప్పు అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement