ఛోటూకు కారుణ్య మరణం | authorities approve request of euthanasia to Himalayan Black Bear at Indore Zoo | Sakshi
Sakshi News home page

ఛోటూకు కారుణ్య మరణం

Dec 5 2015 10:36 AM | Updated on Apr 3 2019 4:10 PM

ఛోటూకు కారుణ్య మరణం - Sakshi

ఛోటూకు కారుణ్య మరణం

ఛోటూ గత మూడేళ్లుగా అచేతనంగా పడి ఉంది. ఛోటూకు సోకిన పక్షవాతం దానిని కనీసం అటూ ఇటూ కదలడానికి కూడా వీలు లేకుండా చేసింది.

ఇండోర్: ఛోటూ గత మూడేళ్లుగా అచేతనంగా పడి ఉంది. తనకు సోకిన పక్షవాతం వల్ల కనీసం అటూ ఇటూ కదలడానికి కూడా వీలు లేకుండా పోయింది. దీంతో అధికారులు 35 ఏళ్ల ఛోటూ పడుతున్న ఇబ్బందిని చూడలేక దానికి శనివారం కారుణ్య మరణాన్ని ప్రసాదిస్తున్నారు.  దానిని ఎంతో అల్లారుముద్దుగా ఛోటూను సాకిన జీవన్ దాదా బాధ మాటల్లో వర్ణించలేనిది.

ఇండోర్ జూలోని హిమాలయన్ రకానికి చెందిన ఎలుగుబంటి ఛోటూకు కారుణ్య మరణాన్ని అమలు చేయాలని సెంట్రల్ జూ అథారిటీ నిర్ణయించింది. జూలో పుట్టినప్పటి నుంచి ఛోటూను సంరక్షించిన జీవన్ దాదా శుక్రవారం దానికి చివరిసారిగా అహారం అందించాడు. ఛోటూ కోలుకోవడానికి అత్యుత్తమ వైద్యులతో చికిత్స అందించినా అవేమీ ఫలితాలను ఇవ్వలేదని జూ ఇంచార్జ్ డాక్టర్ ఉత్తమ్ యాదవ్ తెలిపారు.

గత సంవత్సరం ఛోటూకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలనే ప్రతిపాదనకు జీవన్ దాదా నిరాకరించాడు. పూర్తిగా వృద్ధాప్యంలోకి ప్రవేశించిన ఆ ఎలుగుబంటి ఇక కోలుకోవడం కష్టమని తెలిపిన వైద్యులు.. కష్టం మీద ఇటీవల జీవన్ దాదాను ఒప్పించారు. ఎలుగుబంటికి నొప్పి కలిగించని విధానం ద్వారా జూ అధికారులు, ఎన్జీవోల సమక్షంలో వైద్యులు దానికి కారుణ్య మరణాన్ని అమలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement