‘సరి-బేసి విధానానికి ఇక సరి’

Arvind Kejriwal Says Weather Better Now In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో కాలుష్య తీవ్రత తగ్గడంతో వాహనాల నియంత్రణకు సరి-బేసి విధానం ఎంతో కాలం అవసరం ఉండబోదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. దీపావళి అనంతరం దేశ రాజధానిలో కాలుష్య స్ధాయిలు అత్యంత ప్రమాదకరంగా మారడంతో నవంబర్‌ 4 నుంచి 16 వరకూ సరి-బేసి విధానాన్ని ఢిల్లీ ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గురునానక్‌ దేవ్‌ 550వ జయంతోత్సవాల సందర్భంగా ఈనెల 11, 12 తేదీల్లో సరి-బేసి విధానానికి బ్రేక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ స్కీమ్‌ను తొలిసారి 2016 జనవరి 1-15న మళ్లీ అదే ఏడాది ఏప్రిల్‌ 15-30 వరకూ అమలు చేశారు. తొలి రెండు ఎడిషన్స్‌లో ఈ రూల్‌ నుంచి ఆదివారాలకు మినహాయింపు ఇచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top