కేజ్రివాల్ కాంగ్రెస్ ఏజెంట్, కమెడియన్: రాందేవ్
ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ పై యోగా గురువు రాందేవ్ బాబా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ పై యోగా గురువు రాందేవ్ బాబా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేజ్రివాల్ ను కాంగ్రెస్ పార్టీ ఏజెంట్, కమెడియన్ అని వ్యాఖ్యలు చేశారు. కేజ్రివాల్ ను కాంగ్రెస్ పార్టీ పావుగా ఉపయోగించుకుంటుందని... అందుకే వారణాసిలో నరేంద్రమోడీపై పోటికి పెడుతోందని ఆయన అన్నారు.
అవినీతి ఆరోపణలున్న కేంద్రమంత్రి కపిల్ సిబల్, డీఎంకే ఎంపీ కణిమొళిపై ఎందుకు పోటీ చేయరని రాందేవ్ బాబా ప్రశ్నించారు. అవినీతిపై పోరాటం చేయాలనే ధృడ సంకల్పం ఉంటే కాంగ్రెస్ పార్టీ నేతలపై పోటికి దిగాలని రాందేవ్ సూచించారు. అయితే ప్రధాని పదవి కోసం మోడీ పాకులాడుతున్నారని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని రాందేవ్ తెలిపారు. మోడీపై తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన అన్నారు.