ఎదురుకాల్పుల్లో ఆర్మీ మేజర్‌, జవాను మృతి

ఎదురుకాల్పుల్లో ఆర్మీ మేజర్‌, జవాను మృతి


శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఆర్మీ మేజర్‌ సహా ఓ జవాను మృతి చెందారు. దక్షిణ కశ్మీర్‌... షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య గురువారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించారు. 


ఈ కాల్పుల్లో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. అందులో ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు  సమాచారం. జిల్లాలోని జైపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న బలగాలపైకి తీవ్ర వాదులు తెగబడ్డారని, ఇంకా కాల్పులు జరుగుతున్నాయని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.



మరోవైపు కుల్గాం జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గోపాల్‌పురలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఇద్దరు తీవ్రవాదులను మట్టుబెట్టాయి. ​మృతి చెందిన ఉగ్రవాదులు గతంలో జరిగిన ఓ బ్యాంకు దోపిడీ ఘటనలో ప్రధాన నిందితులు.  ఘటనాస్థలం నుంచి రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top