బోర్డర్లో గ్రామస్తులకు తొలి కాంక్రీట్ బాంబ్ షెల్టర్ | Army hands over first underground concrete bomb shelter to villagers | Sakshi
Sakshi News home page

బోర్డర్లో గ్రామస్తులకు తొలి కాంక్రీట్ బాంబ్ షెల్టర్

Jun 21 2016 1:32 PM | Updated on Sep 4 2017 3:02 AM

బోర్డర్లో గ్రామస్తులకు తొలి కాంక్రీట్ బాంబ్ షెల్టర్

బోర్డర్లో గ్రామస్తులకు తొలి కాంక్రీట్ బాంబ్ షెల్టర్

సరిహద్దు ప్రాంతాల్లో నివసించే గ్రామీణ ప్రజలకు భారత ఆర్మీ పెద్ద ఊరటను కలిగించింది. వారికి తొలిసారి కాంక్రీట్తో నిర్మించిన అండర్ గ్రౌండ్ బాంబు దాడి నివారణ షెల్టర్ను అప్పగించింది.

జమ్మూ: సరిహద్దు ప్రాంతాల్లో నివసించే గ్రామీణ ప్రజలకు భారత ఆర్మీ పెద్ద ఊరటను కలిగించింది. వారికి తొలిసారి కాంక్రీట్తో నిర్మించిన అండర్ గ్రౌండ్ బాంబు దాడి నివారణ షెల్టర్ను అప్పగించింది. ఈ షెల్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారీ మొత్తంలో సమీప గ్రామస్తులు, ఆర్మీ అధికారులు హాజరయ్యారు. పూంచ్ జిల్లాలోని గాలి మైదాన్ ప్రాంతం వద్ద ఈ షెల్టర్ను ఆర్మీ నిర్మించింది.

'పాకిస్థాన్తో సరిహద్దు కలిగిన ఈ ప్రాంతంలో ఆర్మీ కమాండర్స్ను, గ్రామస్తులను లక్ష్యంగా చేసుకొని నిత్యం పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటుంది. ఈ నేపథ్యంలో ఆ దాడులవల్ల జరిగే నష్ట నివారణ చర్యల్లో భాగంగా అండర్ గ్రౌండ్ లో ఈ షెల్టర్ నిర్మించి గ్రామస్తులకు అందించాం. ఈ కాంక్రీట్ షెల్టర్ గ్రామస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వారిని దాడుల నుంచి రక్షిస్తుంది' అని ఓ ఆర్మీ అధికారి తెలిపారు. ఈ షెల్టర్ లో ప్రత్యేక టాయిలెట్లతోపాటు, సోలార్ పవర్ కూడా ఏర్పాటుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement