ఆ.. ప్రేమలో పడ్డ 'అనుష్క' | Anushka’s love for Pokemon GO, wanna catch ’em all | Sakshi
Sakshi News home page

ఆ.. ప్రేమలో పడ్డ 'అనుష్క'

Jul 27 2016 4:02 PM | Updated on Apr 8 2019 8:07 PM

ఆ.. ప్రేమలో పడ్డ 'అనుష్క' - Sakshi

ఆ.. ప్రేమలో పడ్డ 'అనుష్క'

బాలీవుడ్ నటి అనుష్కా శర్మ పోకేమాన్ గో గేమ్ కు ఫిదా అయిపోయింది. బయటకు వెళ్ళి పోకేమాన్ లను వెతికి పట్టుకోవడంలో ఎంత ఆనందం ఉందో తెలుస్తోందని, ఈ గేమ్ తనకు ఎంతో ఇష్టంగా ఉందని అంటోంది.

ముంబైః ప్రపంచాన్ని పిచ్చెత్తిస్తున్న పోకేమాన్ గో గేమ్.. ఇప్పుడు సాధారణ పౌరుల్నే కాదు సెలబ్రిటీలను వదలడం లేదు. ఇటీవలే పోకేమాన్ గో గురించి తెలుసుకున్న బాలీవుడ్ నటి అనుష్కా శర్మ పోకేమాన్ గో గేమ్ కు ఫిదా అయిపోయింది. బయటకు వెళ్ళి పోకేమాన్ లను వెతికి పట్టుకోవడంలో ఎంత ఆనందం ఉందో తెలుస్తోందని, ఈ గేమ్ తనకు ఎంతో ఇష్టంగా ఉందని అంటోంది. నిజంగానే జంతువులను వేటాడేందుకు వెళ్ళిన వేటగాడిలా పోకేమాన్ లను వెతుక్కుంటూ వెళ్ళడం వాటిని వేటాడి పట్టడం ఎంతో అద్భుతంగా ఉందంటోంది. ఇటీవల సుల్తాన్ సినిమాలో తనదైన పాత్రతో అభిమానులకు మరింత చేరువైన అనుష్కా.. సినిమా షూటింగ్ లు, డైలీ రొటీన్ లైఫ్ కు భిన్నంగా పోకేమాన్ గో ఆడుకుంటూ సరదాగా టైమ్ పాస్ చేయాలని సంబరపడిపోతోంది.

మొబైల్ గేమ్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్న సరికొత్త ఆట పోకేమాన్ గో బాలీవుడ్ నటి అనుష్కా శర్మకూ ఎంతో నచ్చేసిందట. పోకేమాన్ లను వెతుక్కుంటూ బయటకు వెళ్ళి ఒక్కోటి పట్టుకోవడంలో ఆనందమే వేరంటూ ఇప్పుడు ఆ బాలీవుడ్ తార  తెగ సంబరపడిపోతోంది. తానో  నైపుణ్యంగల పోకేమాన్ హంటర్ గా మారిపోవాలని ఉందని చెప్తున్న ఆమె.... మొదటి పోకేమాన్ ను పట్టుకున్న తర్వాత.. ఆటపై తనకు మరింత మక్కువ పెరిగిందని, పో్కేమాన్ల కోసం వెతుకుతూ ప్రయాణించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్తోంది. మొదటిసారి పోకేమాన్ క్యాచ్ చేసిన అనంతరం తాను సాధించిన అద్భుతానికి గుర్తుగా ఓ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేసింది.

ఫోన్ లో గేమ్ ఆన్ చేసి ఇంటర్నెట్ కు కనెక్ట్ అయిన తర్వాత జీపీఎస్ ఆధారంగా ఆడే పోకేమాన్ గో... ఇంతకు ముందున్న మొబైల్ గేమ్ లకు భిన్నంగా అందర్నీ ఆకట్టుకుంటోన్న విషయం తెలిసిందే. ఫోన్ లో ఉన్న కెమెరా కనెక్ట్ అవ్వడంతోనే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కెడెక్కడ పోకేమాన్ లు ఉన్నాయో జీపీఎస్ వ్యవస్థ ద్వారా  స్క్రీన్ లో కనిపిస్తుంటుంది. ఒకేచోట ఉండేకన్నా.. అలా నడుస్తూ కారిడార్లు, రోడ్లు, ఆఫీస్ లు, పార్క్ లు, మైదానాలు ఎక్కడికైనా వెళ్ళి ఈ పోకేమాన్ లను పట్టుకోవచ్చు. కనిపించిన వెంటనే పసిగట్టి, వాటిని పోకేబాల్ తో కొడితే చాలు అవి మన సొంతం అయిపోతాయన్న మాట. అలా ఆడుతూ ముందుకు పోతుంటే ఆటలో ఒక్కో లెవెల్ ను దాటే అవకాశం ఉంటుంది. ఇలా గేమ్ ఆడుతూ మొత్తం పోకేమాన్ లు తనసొంతమే చేసుకోవాలనుంది అంటోంది అనుష్క. అంతేకాదు తాను ఓ మంచి పోకేమాన్ హంటర్ గా కూడా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement