మరో బోటు తప్పించుకుందా? | another boat escapes from porbandar coast | Sakshi
Sakshi News home page

మరో బోటు తప్పించుకుందా?

Jan 3 2015 4:17 PM | Updated on Apr 3 2019 5:24 PM

మరో బోటు తప్పించుకుందా? - Sakshi

మరో బోటు తప్పించుకుందా?

గుజరాత్ తీరంలోకి వచ్చి.. పేలిపోయిన బోటుతో పాటు మరో బోటు కూడా పాక్ నుంచి వచ్చిందట!

గుజరాత్ తీరంలోకి వచ్చి.. పేలిపోయిన బోటుతో పాటు మరో బోటు కూడా పాక్ నుంచి వచ్చిందట! భారత కోస్ట్ గార్డ్ బృందాల కన్నుగప్పి తప్పించుకుని పారిపోయిందని అంటున్నారు. పాకిస్థాన్లోని కేతిబందర్ ప్రాంతం నుంచి భారీ ఆయుధ సామగ్రితో వచ్చిన ఒక మత్స్యకార బోటును భారత కోస్ట్ గార్డ్ దళాలు గమనించి చుట్టుముట్టడంతో అందులోని ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకుని.. బోటును కూడా పేల్చేసిన విషయం తెలిసిందే. అయితే.. అప్పుడు వచ్చినది ఒక్కటి కాదని, రెండు బోట్లని తాజా సమాచారం.

భారత కోస్ట్ గార్డ్ బృందాలు రెండో బోటును కూడా గమనించాయి. ఇది కూడా కేతిబందర్ నుంచే వచ్చింది. ఈ విషయం కోస్ట్ గార్డ్కు తెలిసినా.. ఈలోపు మొదటి బోటు పేలుడు హడావుడి ఉండటంతో అది తప్పించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement