సీబీఐపై ప్రత్యేక కోర్టు ఆగ్రహం | Sakshi
Sakshi News home page

సీబీఐపై ప్రత్యేక కోర్టు ఆగ్రహం

Published Sat, Sep 6 2014 1:51 AM

Angry over the CBI special court

‘కోల్‌గేట్’ చార్జిషీట్‌ను తిప్పిపంపిన జడ్జి

న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం దర్యాప్తులో సీబీఐ తీరును ప్రత్యేక కోర్టు శుక్రవారం మరోసారి తప్పుబట్టింది. కోల్‌కతాలోని ఒక కంపెనీకి సంబంధించిన కేసులో నలుగురు నిందితులను కేసుల నుం చి తప్పించడంపై సరైన వివరణ ఇవ్వలేదని పేర్కొంటూ సంబంధిత చార్జిషీట్‌ను తిప్పిపంపింది.

జార్ఖండ్‌లోని రాజరా పట్టణంలోని బొగ్గు క్షేత్రాన్ని విని ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్‌కు కేటాయించడానికి సం బంధించిన కేసులో ఆ కంపెనీ డెరైక్టర్లు,పలువురు ఉన్నతాధికారులపై కోర్టుకు సమర్పిం చిన చార్జిషీట్లో నుంచి ముందుగా ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్న నలుగురిని తప్పించటంపై సీబీ ఐ వివరణ ఇవ్వలేదని కోర్టు ఆక్షేపించింది.
 

Advertisement
Advertisement