అనంత్‌నాగ్‌ ఉప ఎన్నిక వాయిదా | Ananth Nag, by-election postponed | Sakshi
Sakshi News home page

అనంత్‌నాగ్‌ ఉప ఎన్నిక వాయిదా

Apr 11 2017 3:07 AM | Updated on Aug 14 2018 4:34 PM

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ లోక్‌సభ స్థానానికి బుధవారం జరగాల్సిన ఉప ఎన్నిక మే 25కు వాయిదా పడింది.

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ లోక్‌సభ స్థానానికి బుధవారం జరగాల్సిన ఉప ఎన్నిక మే 25కు వాయిదా పడింది.

శాంతి భద్రతలు అదుపులో లేవని జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం నివేదించడంతో ఎన్నికల సంఘం (ఈసీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఉపఎన్నికకు పోలింగ్‌ జరగాల్సిన రెండు బూత్‌లకు దుండగులు ఆదివారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. దీంతో అనంత్‌నాగ్‌ నియోజకవర్గ పరిధిలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement