నెహ్రు చేసిన తప్పిదం వల్లే : అమిత్‌ షా | Amit Shah Says Jawaharlal Nehru Mistake in Kashmir Can Not Be Easily Solved | Sakshi
Sakshi News home page

అంతా నెహ్రు వల్లే : అమిత్‌ షా

Mar 1 2019 12:08 PM | Updated on Mar 1 2019 2:26 PM

Amit Shah Says Jawaharlal Nehru Mistake in Kashmir Can Not Be Easily Solved - Sakshi

మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రు చేసిన తప్పిదం వల్లే కశ్మీర్‌ సమస్య జఠిలమైందని

న్యూఢిల్లీ : భారత్‌ మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రు చేసిన తప్పిదం వల్లే కశ్మీర్‌ సమస్య జఠిలమైందని బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే కాంక్లేవ్‌ 2019లో శుక్రవారం అమిత్‌ షా మాట్లాడుతూ.. 1947లో నెహ్రు కశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తి కల్పించి పెద్ద తప్పిదం చేశారని, దాని పరిహాసమే ప్రస్తుత పరిస్థితులకు కారణమన్నారు.  కశ్మీర్‌ సమస్య శాశ్వత పరిష్కారానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఆర్టికల్‌ 370, 35-ఏ విషయాల్లో ఏమైన మార్పులు చేస్తారా అన్న ప్రశ్నను ఆయన దాటేవేసారు. ఈ అంశంపై తాను మాట్లాడబోనని తెలిపారు.

పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు మరణించినా.. పాక్‌ ప్రధాని ఈ ఘటనను ఖండించకపోవడంపై షా ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్వామా ఉగ్రదాడి, భారత వాయుసేన సర్జికల్‌ స్ట్రైక్స్‌ను తమ ఎన్నికల ప్రచారానికి వాడుకోమని స్పష్టం చేశారు. మోదీ చేసిన అభివృద్ధి ఎజెండాతోనే ఎన్నికలు వెళ్తామన్నారు. మోదీ హయాంలో జరిగిన అభివృద్ధి ఎవరి హయాంలో జరగలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కేవలం గాంధీల కోసమేనని,  బీజేపీ మాత్రం ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. చదవండి : (పాకిస్తాన్‌కు దీటుగా బదులిచ్చాం : అమిత్‌ షా )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement