'నేనేం విసిరిపారేసే చెప్పును కాదు' | Am Not A Chappal, Says Actor Ambareesh About Being Sacked As Minister | Sakshi
Sakshi News home page

'నేనేం విసిరిపారేసే చెప్పును కాదు'

Jun 21 2016 2:15 PM | Updated on Sep 4 2017 3:02 AM

'నేనేం విసిరిపారేసే చెప్పును కాదు'

'నేనేం విసిరిపారేసే చెప్పును కాదు'

తానేం తగిలించుకొని విసిరిపారేసే చెప్పులాంటివాడిని కాదని ప్రముఖ కన్నడ నటుడు, కాంగ్రెస్ పార్టీ నేత అంబరీష్ అన్నారు. తన పాపులారిటీ తనకు ఉందని అన్నారు.

బెంగళూరు: తానేం తగిలించుకొని విసిరిపారేసే చెప్పులాంటివాడిని కాదని ప్రముఖ కన్నడ నటుడు, కాంగ్రెస్ పార్టీ నేత అంబరీష్ అన్నారు. తన పాపులారిటీ తనకు ఉందని అన్నారు. అంబరీష్ తో సహా 14మంది మంత్రులను తొలగించి కొత్తగా 13మందిని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన కేబినెట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. మూడేళ్లుగా గృహనిర్మాణ శాఖ నిర్వహిస్తున్నా అందులో ఎలాంటి అభివృద్ధి చూపించలేకపోయారనే కారణంతో ఆయనను తొలగిస్తున్నట్లు వార్తలు వినిపించాయి.

అయితే, తనను మంత్రి పదవి నుంచి తప్పించడానికి నిరసనగా అంబరీష్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే, ఈ లేఖ సరైన ఫార్మాట్లో లేదని తిరిగి పంపించాలని స్పీకర్ ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను తొలగిస్తున్న విషయం కూడా ముందుగా ముఖ్యమంత్రి చెప్పలేదని అన్నారు. తానేం తగిలించుకుని విసిరిపారేసే చెప్పును కాదని, తన పాపులారిటీ తనకు ఉందని అన్నారు. కాగా, ఇప్పటికే ఆయనకు మద్దతుగా మరోసారి కన్నడ చిత్ర పరిశ్రమ తమ గొంతు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement