ఉగ్రదాడిపై ముగిసిన అఖిలపక్ష సమావేశం

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిపై అఖిలపక్ష సమావేశం ముగిసింది. పార్లమెంట్ లైబ్రరీ హాల్‌లో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ఉగ్రదాడిపై తీసుకోబోయే చర్యలను రాజ్‌నాథ్ సింగ్ అఖిలపక్ష నేతలకు వివరించారు. భారత దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసే చర్యలను అనమతించేదిలేదని అఖిలపక్షం అభిప్రాయపడింది. ఉగ్రవాదుల చర్యలను తిప్పికొట్టాల్సిందేనని నిర్ణయించింది.
ఈ విషయంలో ప్రభుత్వం చేపట్టే చర్యలకు పూర్తి మద్దతు ఉంటుందని సమావేశంలో పాల్గొన్న ఆయా పార్టీలు స్పష్టం చేశాయి. ఈ సందర్భంగా చేసిన మూడు తీర్మానాలను అఖిలపక్షం ఆమోదించింది. ఉగ్రవాద చర్యలను తిప్పికొట్టేందుకు సైనికులకు దేశమంతా అండగా నిలబడి ఉందని అఖిలపక్షం అభిప్రాయపడింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి