‘మరో కార్గిల్‌ వార్‌కు రెఢీ’

Air Force Chief Says Well Prepared To Fight Another Kargil War    - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మన సైనిక బలగాలు అవసరమైతే మరో కార్గిల్‌ యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నాయని భారత వాయుసేన చీఫ్‌ బీఎస్‌ ధనోవా అన్నారు. చివరి యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని, మరోసారి కార్గిల్‌ యుద్ధం వస్తే దీటుగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

కార్గిల్‌ యుద్ధం జరిగి 20 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ధనోవా మాట్లాడారు. ఎలాంటి వాతావరణంలోనైనా శత్రు దేశంపై బాంబులతో విరుచుకుపడగల సామర్ధ్యం వైమానిక దళం సొంతమని చెప్పారు. గురితప్పకుండా లక్ష్యాన్ని ఢీ కొట్టగలిగే మన సామర్ధ్యం బాలాకోట్‌ వైమానిక దాడుల్లో మనం చూశామని చెప్పుకొచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top