కరోనా వ్యాక్సిన్‌ : ఎయిమ్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

AIIMS Delhi to start human trials of Covaxin from today - Sakshi

ఢిల్లీలోని ఎయిమ్స్‌కు  ఎథిక్స్‌ కమిటీ అనుమతి

త్వరలో ‘కోవాక్సిన్’‌  హ్యూమన్‌  క్లినికల్ ‌ట్రయిల్స్‌ 

సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ శరవేగంగా విస్తరిస్తున్నవేళ తొలి దేశీయ వ్యాక్సిన్ కోవాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ‍్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రధాన ఆసుపత్రిలలో  హ్యూమన్‌ ‌ట్రయిల్స్‌ ప్రారంభం కాగా ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సంస్థ ఆల్ ఇండియా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు కూడా ఎథిక్స్ అనుమతి లభించింది. (కరోనా వ్యాక్సిన్‌.. వాలంటీర్‌కు తొలి డోస్‌)

కోవిడ్-19 టీకా పరీక్షలకు సంబంధించిన వాలంటరీ ఎంపిక ప్రక్రియను  చేపట్టనున్నామని, సంబంధిత వాలంటీర్ల ఆరోగ్య పరీక్షలను ప్రారంభించామనీ ఎయిమ్స్ సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్  వెల్లడించారు.  ఇప్పటికే కొంతమంది వాలంటీర్లు  తమ పేర్లను నమోదు చేసుకున్నారని రాయ్‌ తెలిపారు. మొదటి దశలో, 375 వాలంటీర్లపై వ్యాక్సిన్‌ను పరీక్షించనున్నారు. వీరిలో గరిష్టంగా 100 మంది ఎయిమ్స్ నుంచే ఉండనున్నారు.

కాగా ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్  కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాక్సిన్‌ను రూపొందించింది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ వ్యాక్సిన్‌ కోవాక్సిన్‌ను ఆగస్టు15నాటికి అందుబాటులోకి తీసుకురావాలనిఐసీఎంఆర్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఎయిమ్స్ సహా దేశంలోని 13 ఆస్పత్రులలో హ్యూమన్‌ ట్రయల్స్‌ను వేగవంతం చేయనున్నారు.  హైదరాబాద్‌లో నిమ్స్‌లో ఈ పరీక్షలు నేడు( సోమవారం) ప్రారంభమైనాయి. పట్నాలోని ఎయిమ్స్‌లో చిన్నమోతాదులో తొమ్మిదిమందికి  ట్రయల్స్‌ గతవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top