ట్రంప్‌ టూర్‌ : ఆగ్రా మేకోవర్‌.. | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ టూర్‌ : ఆగ్రా మేకోవర్‌..

Published Thu, Feb 20 2020 12:02 PM

In Agra Makeover For Trump Visit - Sakshi

ఆగ్రా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వచ్చేవారం భారత్‌ పర్యటన సందర్భంగా ఆయన సందర్శించే ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అహ్మదాబాద్‌లో ట్రంప్‌నకు అపూర్వ స్వాగతం పలికేలా ఏర్పాట్లు జరుగుతుంటే ఆయన పర్యటించే ఆగ్రాలోనూ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేపడుతున్నారు. అగ్రనేత రాకతో ఆగ్రా సరికొత్త అందాలను సంతరించుకుంటోంది. వీధులకు పెయింటింగ్‌లు వేసి తీర్చిదిద్దడంతో పాటు యమునా నదిలోకి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేశారు.

అమెరికా నుంచి వచ్చిన సెక్యూరిటీ బృందం తాజ్‌మహల్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించింది. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ చారిత్రక కట్టడాన్ని సందర్శించి ట్రంప్‌ రాకకు జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు. గత కొద్ది రోజులుగా 500 క్యూసెక్కుల నీటిని యుమనా నదిలోకి యూపీ ఇరిగేషన్‌ శాఖ విడుదల చేసింది. నదీ జలాల వ్యర్ధాల నుంచి వచ్చే దుర్వాసనను నియంత్రించేందుకు తాజా నీటిని అధికారులు విడుదల చేశారు.

చదవండి : ఆగ్రా పేరు ఇక 'అగ్రవాన్‌'..!

Advertisement
 
Advertisement