ఆగ్రా పేరు ఇక 'అగ్రవాన్‌'..!

Now Agra Name To Be Changed As Agravan - Sakshi

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ బాధ్యతలు చేపట్టాక ప్రముఖ నగరాల పేర్లు ఒక్కొక్కటిగా మార్చడం మొదలెట్టారు. ఇప్పడు తాజాగా.. ఆ జాబితాలోకి ఆగ్రా కూడా చేరనుంది. దీనికోసం డాక్టర్ భీంరావ్ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం ఆగ్రా పేరు మార్పుపై ప్రయత్నాలు ప్రారంభించింది. ఆగ్రాకు 'అగ్రవాన్‌' అని పేరు మార్చడానికి ప్రతిపపాదనలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా చరితత్రను వెలికితీసే పనిలో పడ్డారు.

ఆగ్రాకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు అంబేద్కర్‌ వర్సిటీలోని చరిత్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ సుగమ్ ఆనంద్ పరిశోధనలు ప్రారంభించారు. తాజ్‌నగర్‌కు మొదట్లో అగ్రవాన్‌ అనే పేరు ఉన్నట్లు ప్రాథమిక సాక్ష్యాల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన సమస్త సమాచారాన్ని వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు. మహాభారత కాలంలో ఆగ్రా నగరాన్ని అగ్రవాన్‌, అగ్రబాణ్‌ అని పిలిచేవారని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను వెలికితీస్తున్నట్లు ప్రొఫెసర్‌ సుగమ్‌ ఆనంద్‌ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top