‘భూ ఆర్డినెన్స్‌పై లోక్‌పాల్ తరహా ఉద్యమం’ | agitation on land ordinance, says anna hazare | Sakshi
Sakshi News home page

‘భూ ఆర్డినెన్స్‌పై లోక్‌పాల్ తరహా ఉద్యమం’

Feb 21 2015 1:23 AM | Updated on Sep 2 2017 9:38 PM

భూసేకరణ ఆర్డినెన్స్‌పై లోక్‌పాల్ తరహా ఉద్యమం చేస్తామని సామాజిక కార్యకర్త అన్నా హజారే హెచ్చరించారు.


 ఫరీదాబాద్: భూసేకరణ ఆర్డినెన్స్‌పై లోక్‌పాల్ తరహా ఉద్యమం చేస్తామని సామాజిక కార్యకర్త అన్నా హజారే హెచ్చరించారు. ఈ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములవ్వాలని, అవవసరమైతే జైలుకూ వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఈ నెల 23, 24న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద హజారే దీక్ష చేపట్టనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఫరీదాబాద్ నుంచి ‘జల్-జంగిల్-జమీన్’ మార్చ్ టు ఢిల్లీని ఆయన ప్రారంభించారు. పంజాబ్, హరియాణా, యూపీ నుంచి 50వేల మందికి పైగా రైతులు ఈ దీక్షలో పాల్గొనబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అనుకున్నది సాధించేవరకు ఢిల్లీని వదలమని, ‘జైల్ భరో’నూ ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం పేద రైతుల భూములు లాక్కొని పారిశ్రామికవేత్తలకి అప్పగిస్తోందన్నారు. భూసేకరణ చట్ట సవరణలపై కేంద్రానికి వ్యతిరేకంగా హజారే చేపట్టనున్న నిరసనకు ఆయన కోరితే మద్దతిస్తామని ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రకటించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement