ఆర్మీతో సమానంగా తమకు వేతనాలు, ఇతర అలవెన్సులు ఇవ్వాలంటూ ఫేస్‌బుక్‌లో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ వీడియో పోస్ట్ చేయడం సంచలనం సృష్టించింది.
సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ సందేశం
న్యూఢిల్లీ: ఆర్మీతో సమానంగా తమకు వేతనాలు, ఇతర అలవెన్సులు ఇవ్వాలంటూ ఫేస్‌బుక్‌లో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ వీడియో పోస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. సాయుధ బలగాలతో పోలిస్తే పారామిలిటరీ సిబ్బందికి చెల్లించే వేతనాలు, ఇతర ప్రయోజనాల విషయంలో వివక్ష చూపుతున్నారని ఆరోపించాడు. వీడియో పోస్ట్ చేసిన జవాన్‌ను జీత్ సింగ్‌గా గుర్తించారు.
ఇది పాత వీడియో అని, ఆ జవానుకు సర్వీసుకు సంబంధించి ఫిర్యాదులు ఉన్నాయని, వేతనాలు, ఇతర ప్రయోజనాల విషయంలో వివక్షను తొలగించాలని కోరాడని సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కె.దుర్గాప్రసాద్ చెప్పారు. మరోపక్క లాన్స్ నాయక్ యజ్ఞ ప్రతాప్ సింగ్ అనే జవాను తన పైస్థాయి అధికారులు తనను వేధిస్తున్నారంటూ మరో వీడియో పోస్ట్ చేశాడు.