విజయ్‌కు ఐటీ అధికారుల షాక్‌.. | Actor Vijay Questioned By Income Tax Department | Sakshi
Sakshi News home page

విజయ్‌కు ఐటీ అధికారుల షాక్‌..

Feb 5 2020 5:10 PM | Updated on Feb 5 2020 5:24 PM

Actor Vijay Questioned By Income Tax Department - Sakshi

తమిళ హీరో విజయ్‌ను పన్ను ఎగవేత కేసులో ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

చెన్నై : ఓ సినీ నిర్మాణ సంస్థ పన్ను ఎగవేత కేసుకు సంబంధించి తమిళ హీరో విజయ్‌ను ఆదాయ పన్ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. సినిమా షూటింగ్‌లో ఐదు గంటల పాటు ప్రశ్నించిన అనంతరం ఇంట్లోనూ విజయ్‌ను ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏజీఎస్‌ సినిమాస్‌ కార్యాలయాలు, ఆస్తులతో పాటు సినీ ఫైనాన్షియల్‌ అన్బు చెలియన్‌ మధురై కార్యాలయాలపైనా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. విజయ్‌ హీరోగా రూపొందిన బిజిల్‌ సినిమాను గత ఏడాది ఏజీఎస్‌ సినిమాస్‌ నిర్మించింది.

కాగా గత ఏడాది అక్టోబర్‌లో విజయ్‌ మూవీ మెర్సెల్‌ జీఎస్టీ, నోట్ల రద్దుకు వ్యతిరేకంగా పలు సంభాషణలతో తెరకెక్కడంతో ఈ మూవీపై బీజేపీ తమిళనాడు రాష్ట్ర విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. జీఎస్టీ, డిజిటల్‌ ఇండియా ప్రచారంపై అవాస్తవాలను ప్రచారం చేసేలా మూవీలో ఉన్న కొన్ని డైలాగ్‌లను తొలగించాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement