ఆ హీరో ఇంట్లో ఏనుగు దంతాలు | Actor Jayaram's possession of elephant tusks kicks up row | Sakshi
Sakshi News home page

ఆ హీరో ఇంట్లో ఏనుగు దంతాలు

Jul 7 2015 7:37 PM | Updated on Aug 17 2018 2:34 PM

ఆ హీరో ఇంట్లో ఏనుగు దంతాలు - Sakshi

ఆ హీరో ఇంట్లో ఏనుగు దంతాలు

తన వద్ద ఏనుగు దంతాలు ఉంచుకొని ప్రముఖ తమిళ, మళయాల హీరో జయరామ్ చిక్కుల్లో ఇరుక్కున్నారు. అటవీ జంతువుల హక్కుల ఉద్యమకారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి ఆందోళన ఉధృతం చేశారు.

తిరువనంతపురం: తన వద్ద ఏనుగు దంతాలు ఉంచుకొని ప్రముఖ తమిళ, మళయాల హీరో జయరామ్ చిక్కుల్లో ఇరుక్కున్నారు. అటవీ జంతువుల హక్కుల ఉద్యమకారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి ఆందోళన ఉధృతం చేశారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. జయరామ్కు ఓ పెట్ ఏనుగు ఉంది. అది రెండేళ్ల కింద చనిపోగా దాని రెండు దంతాలు తొలగించి ఆయన తన వద్ద పెట్టుకున్నాడు. కేరళ అటవీ శాఖ కూడా ఇటీవల అందుకు ఆమోదం తెలిపింది.

దీంతో జంతు ప్రేమికుల్లో ఆగ్రహం ఉప్పొంగింది. ఇది మిగితా వారికి తప్పుడు సూచన ఇచ్చినట్లవుతుందని ఆందోళన ప్రారంభించింది. 2003 డిక్లరేషన్ వైల్డ్ లైఫ్ స్టాక్ రూల్ ప్రకారం.. అది నేరమని గుర్తు చేశారు. ఏ వ్యక్తి అయినా జంతువుపైగానీ, చనిపోయిన తర్వాత దాని అవశేషాలపైగానీ హక్కు పొందాలంటే ముందు వారసత్వ దృవపత్రాన్ని పొందాలని అలాంటిదేమి జయరామ్ వద్ద లేదని వారు అంటున్నారు. అయితే, ఈ విషయం తీవ్రం కావడంతో ఫారెస్ట్ టాస్క్ ఫోర్స్ ప్రధాని నరేంద్రమోదీకి ఓ లేఖ రాసింది. వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానిని వారు లేఖలో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement