మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉన్న 142 ఏళ్ల నాటి ఓ చర్చితోపాటు చర్చి ఆధ్వర్యంలో నడిచే స్కూలుపై గత శుక్రవారం జరిగిన దాడి కేసులో పోలీసులు సోమవారం ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.
జబల్‌పూర్/ముంబై: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉన్న 142 ఏళ్ల నాటి ఓ చర్చితోపాటు చర్చి ఆధ్వర్యంలో నడిచే స్కూలుపై గత శుక్రవారం జరిగిన దాడి కేసులో పోలీసులు సోమవారం ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిని దరమ్ సేన అనే హిందూ సంస్థ సభ్యులుగా గుర్తించారు. అయితే అరెస్టు చేసిన వెంటనే నిందితులను బెయిల్‌పై విడుదల చేయడం వివాదాస్పదమైంది. నిందితులను నామమాత్రంగా అరెస్టు చేసి విడిచిపెట్టడం తమను ఎంతగానో బాధించిందని చర్చి వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై జబల్‌పూర్ ఐజీపీ డి. శ్రీనివాస్‌రావును కలసి నిరసన తెలిపిన క్రైస్తవుల ప్రతినిధి బృందం... దాడి ఘటన తాలూకూ సీసీటీవీ ఫుటేజీని ఆయనకు అందించింది. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఈ చర్చిపై 2008లో జరిగిన దాడి ఘటనలో నిందితులను నేటికీ గుర్తించకపోవడం గమనార్హం.