breaking news
church attack
-
కాంగోలో తిరుగుబాటుదారుల ఘాతుకం.. 38 మంది మృతి
-
సంబురాల్లో తుపాకుల మోత.. రక్తమోడిన గువానాజువాటో సిటీ
మెక్సికోలో ఘోర ఘటన చోటు చేసుకుంది. మతపరమైన సంబురాల్లో కొందరు దుండగులు తుపాకులతో కాల్పులకు తెగబబ్డారు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మధ్యకాలంలో అత్యంత హింసాత్మక ప్రాంతంగా ముద్రపడిన గువానాజువాటో రాష్ట్రంలోని ఇరాపువాటోలో ఇది చోటుచేసుకుంది. బుధవారం.. సెయింట్ జాన్ ది బాప్టిస్ట్‌కు గౌరవంగా నిర్వహించిన వీధి ఉత్సవంలో స్థానికులు సంబురాలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో కొందరు దుండగులు తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులకు దిగారు. అప్పటిదాకా మద్యం, చిందుల్లో మునిగిపోయిన ప్రజలు.. భయంకరమైన కాల్పులతో ఒక్కసారిగా బయపడి పరుగులు తీశారు. ఆ సమయంలో చిన్నారులు కూడా ఉన్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇరాపువాటో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 12 మంది అక్కడికక్కడే మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షైన్బామ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ప్రకటించారు. దాడి వెనుక ఉద్దేశం.. దుండగుల వివరాలు తెలియరావాల్సి ఉంది. #Nacionales | 🚨❗ Lamentable... M@asacre en fiesta en Irapuato deja 10 personas sin vida, entre ellos un menor.Al menos 10 personas fueron asesinadas durante un ataque armado en la fiesta patronal de San Juan, en #Irapuato, #Guanajuato, informaron autoridades. Detalles:… pic.twitter.com/yQbGKMRKhE— Plano Informativo Aguascalientes (@planoags) June 25, 2025ఇదిలా ఉంటే.. క్రిమినల్ గ్రూపుల మధ్య తగాదాలతో గువానాజువాటో.. మెక్సికో క్రైమ్ ఏరియాగా పేరు ముద్రపడిపోయింది. గత నెలలో కూడా ఈ స్టేట్‌లో ఓ చర్చి కార్యక్రమంలో ఏడుగురు హత్య గురయ్యారు. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే ఈ రాష్ట్రంలో 1,435 హత్యలు నమోదయ్యాయి, ఇది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రెండింతల సంఖ్య కావడం గమనార్హం. -
Hamburg shooting: జర్మనీ చర్చిలో నరమేధం!
బెర్లిన్: జర్మనీలో నరమేధం చోటు చేసుకుంది. గురువారం రాత్రి హాంబర్గ్‌లోని ఓ చర్చిలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణానికి కారకులు ఎవరు? కారణాలేంటన్నది తెలియాల్సి ఉంది. ఘటన నేపథ్యంలో తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు, స్థానికులను బయటికి రావొద్దని సూచించారు. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హాంబర్గ్ యెహోవా విట్నెస్ సెంటర్ అది. మూడు అంతస్థుల భవనం. మొదటి ఫ్లోర్ నుంచి తుపాకీ పేలిన శబ్ధం వినిపించిందంటూ విపత్తు హెచ్చరిక యాప్ ద్వారా అధికారులకు సమాచారం అందించారు ఎవరో. ఆ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భవనాన్ని చుట్టుముట్టారు. లోనికి ప్రవేశించేందుకు యత్నించారు. అయితే.. కింది ఫ్లోర్లో రక్తపు మడుగుల్లో కొందరు చెల్లాచెదురుగా పడి ఉండడాన్ని గమనించారు. వాళ్లలో కొందరు అప్పటికే ప్రాణం కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు పోలీసులు. పైఫ్లోర్‌లో ఓ వ్యక్తి మృతదేహాం పడి ఉండడాన్ని గుర్తించారు. బహుశా ఆ వ్యక్తే కాల్పులకు పాల్పడి ఉంటాడని, ఘాతుకం అనంతరం ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. కాల్పులకు పాల్పడింది అతనేనా? లేదా ఆ దుండగుడు పరారీలో ఉన్నాడా? అసలు కాల్పులకు ఎందుకు పాల్పడ్డారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు జర్మనీ మీడియా సంస్థలు చనిపోయింది ఆరుగురే అని చెప్తుండగా.. పోలీసులు మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. మరోవైపు హైఅలర్ట్ జారీ చేసిన పోలీసులు.. స్థానికులను బయటకు రావొద్దని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం అందాలని కోరారు. ఇదిలా ఉంటే.. జిహాదీలు, స్థానిక అతివాద గ్రూపుల దాడులతో జర్మనీ గత కొన్నేళ్లుగా దాడులకు గురవుతోంది. ప్రముఖంగా చెప్పుకోవాలంటే.. డిసెంబర్ 2016లో బెర్లిన్‌లోని ఓ క్రిస్మస్ మార్కెట్లో ఐసిస్ ఉగ్రవాదులు దాడికి పాల్పడగా.. 12 మంది మరణించారు. ఇక ఫిబ్రవరి 2020లో హనౌ నగరంలో అతివాద సంస్థ వ్యక్తి ఒకడు జరిపిన కాల్పుల్లో పది మంది దుర్మరణం పాలయ్యారు. -
నరమేధం.. చెల్లాచెదురుగా మృతదేహాలు
ఉగ్రవాదుల మారణహోమంతో ప్రపంచం మరోసారి ఉలిక్కి పడింది. అదను చూసి కాల్పులు, బాంబు దాడులతో మారణహోమం సృష్టించారు. ప్రాణాల కోసం బయటకు పరిగెత్తినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు.. చెల్లాచెదురైన మృతదేహాలే ఎటు చూసినా కనిపించాయి. నైజీరియాలో ఓ చర్చిలో జరిగిన ఉగ్రకాండలో యాభై మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య మరింతంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఓండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఈ ఘటన జరిగింది. ఆదివారం కావడంతో ప్రార్థనల కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. దాడిని చాలా పక్కగా నిర్వహించారు ఉగ్రవాదులు. కొందరు చర్చిలోపల కాల్పులకు పాల్పడగా.. ప్రాణాల కోసం బయటకు పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్లపై బయట ఉన్న మరో ఉగ్రవాది తూటాల వర్షం కురిపించాడు. మృతదేహాలు, చెల్లాచెదురుగా విడిభాగాలతో చర్చి భీతావహంగా ఉంది. ఈ దాడిలో ఎంతమంది మరణించారన్న విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనప్పటికీ.. 50 మందికిపైనే ప్రాణాలు కోల్పోయినట్టు నైజీరియా లోయర్ లెజిస్లేటివ్ చాంబర్ సభ్యుడు అడెలెగ్బె టిమిలెయిన్ తెలిపారు. ఘటన తర్వాత చర్చి ప్రధాన పాస్టర్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెదర్ ప్రాంతానికి చెందిన ఉగ్రవాదుల పనిగా భావిస్తున్నారు. కాగా, చర్చిపై దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. నైజీరియాలో అత్యంత శాంతియుత రాష్ట్రాలలో ఒకటిగా ఖ్యాతికెక్కిన ఓండోలో జరిగిన ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే.. పలు దేశాల అధినేతలు ఘటనను తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. చదవండి: బైడెన్ ఇంటి వద్ద విమాన కలకలం -
చర్చిపై దాడి కేసులో నిందితుల అరెస్ట్
జబల్పూర్/ముంబై: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఉన్న 142 ఏళ్ల నాటి ఓ చర్చితోపాటు చర్చి ఆధ్వర్యంలో నడిచే స్కూలుపై గత శుక్రవారం జరిగిన దాడి కేసులో పోలీసులు సోమవారం ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిని దరమ్ సేన అనే హిందూ సంస్థ సభ్యులుగా గుర్తించారు. అయితే అరెస్టు చేసిన వెంటనే నిందితులను బెయిల్‌పై విడుదల చేయడం వివాదాస్పదమైంది. నిందితులను నామమాత్రంగా అరెస్టు చేసి విడిచిపెట్టడం తమను ఎంతగానో బాధించిందని చర్చి వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై జబల్పూర్ ఐజీపీ డి. శ్రీనివాస్‌రావును కలసి నిరసన తెలిపిన క్రైస్తవుల ప్రతినిధి బృందం... దాడి ఘటన తాలూకూ సీసీటీవీ ఫుటేజీని ఆయనకు అందించింది. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఈ చర్చిపై 2008లో జరిగిన దాడి ఘటనలో నిందితులను నేటికీ గుర్తించకపోవడం గమనార్హం. -
రాజ్‌నాథ్ నివాసం వద్ద క్రైస్తవుల ఆందోళన
న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసం వద్ద క్రైస్తవులు గురువారం ఉదయం నిరసన చేపట్టారు. ఢిల్లీలో పలు ప్రాంతాల్లో చర్చిలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సుమారు 200 మంది ఆందోళనకు దిగారు. 'వుయ్ వాంట్ జస్టిస్, స్టాప్ ఎటాకింగ్ యుజ్' అంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాడులపై ప్రభుత్వం సిట్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు వీరంతా ర్యాలీగా బయల్దేరి రాజ్‌నాథ్ సింగ్ నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. దాంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాటో చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో వారిని అరెస్ట్ చేసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా ఢిల్లీ నగరంలో గత నవంబర్ నుంచి చర్చిలపై అయిదుసార్లు దాడులు జరిగాయి.