ఢిల్లీ ఎమ్మెల్యే అరెస్టు ఖాయం? | AAP MLA Somnath Bharti's anticipatory bail rejected in domestic violence case, may be arrested soon | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఎమ్మెల్యే అరెస్టు ఖాయం?

Sep 22 2015 11:19 AM | Updated on Sep 3 2017 9:47 AM

ఢిల్లీ ఎమ్మెల్యే అరెస్టు ఖాయం?

ఢిల్లీ ఎమ్మెల్యే అరెస్టు ఖాయం?

ఆప్ ఎమ్మెల్యే, ఢిల్లీ మాజీ న్యాయశాఖామంత్రి సోమ్నాథ్ భారతి అరెస్టు దాదాపు ఖాయమైనట్టే.

ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే, ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమ్నాథ్ భారతి అరెస్టు దాదాపు ఖాయమైనట్టే. గృహ హింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. జస్టిస్ సురేష్ కైత్ ఈ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏక్షణంలోనైనా సోమ్నాథ్ ని అదుపులోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

సోమనాథ్‌ భారతిపై ఆయన భార్య లిపికా ఈ ఏడాది జూలై 10న మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తనను మానసికంగా వేధిస్తూ, హింసిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు తన పెంపుడు కుక్క లాబ్రడార్ ను ఉసికొల్పి హత్య చేయడానికి ప్రయత్నించారని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో ఆప్ మాజీ మంత్రిపై గృహ హింస, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.   

మరోవైపు సోమనాథ్‌ భారతి విచారణకు సహకరించడం లేదని ఆరోపిస్తూ పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో  ఆయనపై అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని పేర్కొంటూ, అరెస్టు వారెంట్ ను రద్దు చేయాల్సిందిగా కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement