‘పాప’o అనీ చూడకుండా... | A sad story of baby | Sakshi
Sakshi News home page

‘పాప’o అనీ చూడకుండా...

Jul 2 2016 2:40 AM | Updated on Sep 13 2018 5:11 PM

‘పాప’o అనీ చూడకుండా... - Sakshi

‘పాప’o అనీ చూడకుండా...

కొత్త షూ కొనిస్తానని ఆశచూపి చిన్నారిని బయటకు తీసుకెళ్లి నదిలో విసిరేశాడు సవతి తండ్రి. అయితే అందులో పేరుకుపోయిన గుర్రపు డెక్క పాపను కాపాడింది.

థానే: కొత్త షూ కొనిస్తానని ఆశచూపి చిన్నారిని బయటకు తీసుకెళ్లి నదిలో  విసిరేశాడు  సవతి తండ్రి. అయితే అందులో పేరుకుపోయిన గుర్రపు డెక్క పాపను కాపాడింది. థానేకి చెందిన తులసీరాం కొత్త షూ కొనిపెడతానని ఆరే ళ్ల కూతురు ఏక్తా తులసీ సైనీని బుధవార ం రాత్రి 8 గంటలకు బయటకు తీసుకెళ్లాడు. ఏం దుర్బుద్ధి పుట్టిందోగానీ ఇక్కడి బద్లాపూర్ వాలివ్లీ వంతెన పైనుంచి పాపను నదిలోకి నెట్టెశాడు.  గురువారం ఉదయం అక్కడే పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు పాప ఏడుపు గమనించి పోలీసులు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించాడు. అగ్నిమాపక సిబ్బంది పాపను రక్షించారు.

గుర్రపు డెక్క ఉండటంతోనే ఆమెకు ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. 11 గంటలు గుర్రపుడెక్కలపైనే ఉన్న పాప క్షేమంగా బయటపడింది. బయటకు వచ్చాక పాపను ప్రశ్నిస్తే...తన తండ్రే రాత్రి నీటిలో పడేశాడని చెప్పింది.తన కూతురు కనిపించట్లేదని ఆమె తల్లి బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పాప తండ్రి కోసం వెతుకుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement