మెట్రో రైలు ముందు దూకిన మహిళ | A lady allegedly jumped in front of a train at Govindpuri metro station | Sakshi
Sakshi News home page

మెట్రో రైలు ముందు దూకిన మహిళ

Jan 18 2016 9:28 PM | Updated on Sep 3 2017 3:51 PM

గోవింద్ పురి మెట్రో స్టేషన్ లో మెట్రో రైలు దూసుకొస్తుండగా అనూహ్యంగా ఓ మహిళ దానికి ఎదురుగా ప్లాట్ ఫాంపై నుంచి దూకింది.

న్యూఢిల్లీ: సాధారణంగా ఎవరైనా రైలు వస్తుందంటే పట్టాలు దాటే వారంతా పరుగులు పెడతారు. చటుక్కున ప్లాట్ ఫాం చేరుకొని ప్రాణాలు రక్షించుకుంటారు. కానీ, వేగంగా రైలు దూసుకొచ్చే సమయంలో ఉద్దేశపూర్వకంగా దానిముందుకు దూకేస్తే.. అదృష్టవశాత్తు అలా దూకిన వ్యక్తికి ఎలాంటి ప్రాణహానీ జరగకుంటే.. ఢిల్లీలో అచ్చం ఇలాగే జరిగింది.

సోమవారం సాయంత్రం గోవింద్ పురి మెట్రో స్టేషన్ లో మెట్రో రైలు దూసుకొస్తుండగా అనూహ్యంగా ఓ మహిళ దానికి ఎదురుగా ప్లాట్ ఫాంపై నుంచి దూకింది. అది చూసిన డ్రైవర్ ఒక్కసారిగా అత్యవసర బ్రేక్ అప్లై చేయడంతో ఆమె ఎలాంటి హానీ జరగకుండా బయటపడింది. అయితే, ఆ మహిళ ఎవరు, ఎందుకు అలా చేసిందనే వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement