నాలుగు పులుల మధ్య భీకర పోరు | A 9-Year-Old White Tiger Dies In Brawl Between 4 Big Cats | Sakshi
Sakshi News home page

నాలుగు పులుల మధ్య భీకర పోరు

Sep 21 2017 4:53 PM | Updated on Sep 22 2017 10:02 AM

నాలుగు పులుల మధ్య భీకర పోరు

నాలుగు పులుల మధ్య భీకర పోరు

కర్ణాటకలో ఓ జూపార్క్‌లో విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులోని బన్నేర్‌ఘట్టా బయాలాజికల్‌ పార్క్‌లో పులుల మధ్య పోట్లాట జరిగి ఓ తెల్ల పులి చనిపోయింది.

బెంగళూరు : కర్ణాటకలో ఓ జూపార్క్‌లో విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులోని బన్నేర్‌ఘట్టా బయాలాజికల్‌ పార్క్‌లో పులుల మధ్య పోట్లాట జరిగి ఓ తెల్ల పులి చనిపోయింది. ఈ ఘర్షణ ఆదివారం చోటుచేసుకుంది. పార్క్‌ డైరెక్టర్‌ సంతోష్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ శ్రేయాస్‌ అనే తొమ్మిదేళ్ల తెల్లపులి బుధవారం రాత్రి 8గంటల ప్రాంతంలో కన్నుమూసిందని తెలిపారు.

తీవ్రంగా గాయపడిన పులి తొలుత కోలుకుంటున్నట్లు అనిపించిందని చెప్పారు. టైగర్‌ సఫారీ కోసం గేట్లు తెరిచిన అధికారులు తిరిగి అవి లోపలికి వెళ్లే సమయంలో అవి ఏ బోనులోకి వెళుతున్నాయో గమనించలేదు. దీంతో తెల్లపులులు బెంగాల్‌ టైగర్‌ పులులు ఒకదానికి ఒకటి ఎదురుపడి ఘర్షణ పడ్డాయి. ఈ దాడిలో వైట్‌ టైగర్‌ చనిపోయింది. ఇది ఓ దుర్ఘటన జైలు ఉన్నతాధికారి అభివర్ణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement