అసోంలో బస్సు ప్రమాదం: 9 మంది మృతి | 9 Killed, 17 Injured in Bus Accident at Nagaon in Assam | Sakshi
Sakshi News home page

అసోంలో బస్సు ప్రమాదం: 9 మంది మృతి

Oct 26 2014 9:04 AM | Updated on Sep 2 2017 3:25 PM

అసోంలో బస్సు ప్రమాదం: 9 మంది మృతి

అసోంలో బస్సు ప్రమాదం: 9 మంది మృతి

అధిక వేగంతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు.

అసోం: అధిక వేగంతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం అసోంలోని నగాన్ లో చోటు చేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని తెలిపారు. అసోం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు లక్ష్మీపూర్ జిల్లా నుంచి గౌహతి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని వారు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement