కరోనా: పుదుచ్చేరి వ్యక్తి కేరళలో మృతి!

71 Year Old Native Of Puducherry Lost Breath Covid 19 In Kerala - Sakshi

తిరువనంతపురం: పుదుచ్చేరికి చెందిన ఓ వృద్ధుడు కరోనా వైరస్‌(కోవిడ్‌-19)తో కేరళలో మరణించాడు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య మూడుకు చేరింది. హృద్రోగం, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 71 ఏళ్ల వ్యక్తిని చికిత్స నిమిత్తం తొలుత తలస్సెరిలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి పెరియారం మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి.. ఈ తర్వాత కన్నూరు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో బాధితుడికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో చికిత్స పొందుతూ కన్నూరులోని ఆస్పత్రిలో మృత్యువాత పడ్డాడు. (100 రోజుల కరోనా; కేరళ కేసుల వివరాలు!)

ఈ విషయాన్ని కన్నూరు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కె. నారాయణ నాయక్‌ వెల్లడించారు. మృతుడి స్వస్థలం పుదుచ్చేరి అని.. నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. కాగా శుక్రవారం కేరళలో కొత్తగా ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రాణాంతక వైరస్‌ సోకిన వారి సంఖ్య 364కు చేరింది. వీరిలో 124 మంది కరోనా నుంచి కోలుకున్నారని.. ఏప్రిల్‌ 10 నాటికి రెండు మరణాలు సంభవించాయని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి కేకే శైలజ తెలిపారు. ఇక కరోనా తొలి కేసు నమోదైన కేరళలో 1,29,751 మందిని అబ్వర్జేషన్‌లో ఉంచినట్లు సమాచారం. వీరిలో 1,29.021 మంది ఇంట్లో ఉండగా.. 703 మందిని ఆస్పత్రి క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. (నా కొడుకు కోలుకున్నాడు: దర్శకుడు)

ముఖ్యమంత్రి చొరవ.. ఈ చిన్నారి హ్యాపీ..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top