చెన్నై ఘోర ప్రమాద సంఘటనలో ఏడుగురు మరణించగా, మరో 190 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.
చెన్నై: చెన్నై ఘోర ప్రమాద సంఘటనలో ఏడుగురు మరణించగా, మరో 190 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. మాన్‌గాడులో నిర్మాణంలో ఉన్న11 అంతస్తుల భవనం కుప్ప కూలిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. శిథిలాల నుంచి ఏడు మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
శిథిలాలలో చిక్కుకున్న కూలీలు అందరూ తెలుగువారే. సాధారణంగా ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగువారే కూలీలుగా పని చేస్తుంటారు. వర్షం కురవడంతో భవనం పది అడుగుల లోపలకు కూరుకుపోయింది. భవనం కింద భూమి బలంగా లేనట్లు చెబుతున్నారు. 11 అంతస్తులు నిర్మించేందుకు అనుమతిలేకుండా ఈ భవనం నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.